
గచ్చిబౌలి, వెలుగు: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కొండాపూర్‌లోని సైబర్మిడోస్లోని ఆయన నివాసంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ పరామర్శించారు. ఆదివారం ఉదయం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మృతి చెందారు. దీంతో సోమవారం సాయంత్రం కేటీఆర్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంటికి చేరుకొని పురుషోత్తంరెడ్డి ఫొటోకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, బీఆర్ఎస్లీడర్కార్తీక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.